ఇవాళ, రేపు కాలేజీల బంద్కు PDSU పిలుపు
TG: విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఇవాళ, రేపు డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీల బంద్కు PDSU పిలుపునిచ్చింది. రూ.8వేల కోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని, ఈ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్లు తెలిపింది. సర్కార్ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని కోరింది.

Comments
Post a Comment