Skip to main content

Posts

 ఆధ్యాత్మిక ప్రసంగాలతో దేశ ప్రజలను మేల్కోల్పిన వైతాళికులు.. హైందవ ధర్మ ఔన్నత్వాన్ని ప్రపంచ శిఖరాగ్రాన నిలిపిన ధార్మిక చైతన్యులు.. దేహం నిండా దేశభక్తినీ నింపుకొని, కర్మాచరణమే ధర్మాచరణం అని నిమ్మి, దేశప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాషాయ కేసరీ.. తన వాగ్దాటితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న చైతన్య ఝరీ స్వామి వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు.
Recent posts
 అటాకర్స్ కట్టడికి గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్! క్రోమ్లో ఓ భద్రతా వైఫల్యాన్ని గుర్తించినట్లు గూగుల్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. యూజర్ రిమోట్ అటాకర్ క్రియేట్ చేసిన మాలిషస్ HTML పేజ్నీ విజిట్ చేస్తే అటాకర్స్ ఆ కంప్యూటర్పై కంట్రోల్ పొందే ఆస్కారం ఉంటుంది. దానిని అధిగమించేందుకు గూగుల్ కొత్త అప్డేట్ తెస్తున్నట్లు పేర్కొంది. కొన్నిరోజులు లేదా కొన్నివారాల్లో ఈ సెక్యూరిటీ అప్డేట్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
 30 రోజులు షుగర్ మానేస్తే.. ఎ మవుతుంది.. షుగర్ లేకుండా రోజు గడవని పరిస్థితికి వచ్చేశాం. టీ, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఏదో ఒక రకంగా చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. ఈ షుగరు 30 రోజులపాటు మానేస్తే ఎన్నో జబ్బులను దూరం చేయొచ్చని వెల్నెస్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లివర్ ఫ్యాట్ తగ్గడం, కిడ్నీ పనితీరు మెరుగవడం, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత, ఫోకస్ పెరగడం, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ అవడం వంటి లాభాలున్నాయని చెబుతున్నారు.
 Maharashtra : 3 నెలల్లో 767 మంది రైతుల ఆత్మహత్య మహారాష్ట్రలో వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి మకరంద్ జాధవ్ శాసన మండలిలో వెల్లడించారు. ఇది రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభానికి అద్దం పడుతోందంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఫైరవుతున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందంటూ దుయ్యబడుతున్నారు.
 నేడు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ సమర భేరి’ TG: ‘సామాజిక న్యాయ సమర భేరి' పేరిట కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం HYD LB స్టేడియంలో సభనిర్వహించనుంది. సభకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన సిటీకి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, ఇతర నేతలు సభలో పాల్గొననున్నారు. అంతకంటే ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీలతో ఖర్గే సమావేశం కానున్నారు.
 ట్రంప్ బిల్లుపై IMF హెచ్చరిక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' ఆ దేశ కాంగ్రెస్ సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు అమల్లోకొస్తే రాబోయే పదేళ్లలో USపై $4 ట్రిలియన్ల భారం పడుతుందని IMF అధికార ప్రతినిధి జూలీ కొజాక్ హెచ్చరించారు. ఇప్పటికే ఆ దేశ అప్పులు GDPలో 98 శాతానికి చేరుతున్నాయని గుర్తుచేశారు.
 9న దేశవ్యాప్త సమ్మె ఈనెల 9న దేశంలో 2 రకాల సమ్మెలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. యూపీలో విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొననున్నారు. మరోవైపు అదేరోజు తాము కూడా సమ్మె చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది. 4 లేబర్ కోడ్ల రద్దు, ఉపాధి హామీకి రూ.రెండున్నర లక్షల కోట్ల నిధుల కేటాయింపు, పట్టణాల్లోనూ ఉపాధిహామీ పథకం అమలు చేయాలనే డిమాండ్లతో దీన్ని చేపట్టనున్నట్లు తెలిపింది.