*⚠️ సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలపై జిల్లా పోలీసుల హెచ్చరిక* ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన మోసానికి పాల్పడతున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ల వైద్య పరీక్షల పేరిట డయాగ్నొస్టిక్ సెంటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఈ మోసపు తంతు ప్రకారం, Mahabubnagar జిల్లాలో BSF జవాన్ల క్యాంప్ ఉందని నమ్మకంగా చెప్పుతూ, మా వద్ద 27 మంది జవాన్లు మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉందని, ఒక్కొక్కరికీ ₹3500 చొప్పున మొత్తం ఖర్చు అయ్యే వ్యయానికి మా ఆఫీస్ నుండి మీకు చెల్లిస్తామని, అందుకు గాను మీరు మాకు 50% నగదు అంటే ₹47,250 తక్షణం చెల్లిస్తే, రేపు టెస్టులు అయ్యాక మేము మీకు 50%+100% బిల్లు మొత్తం 1,41,750/- నగదును చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో అత్యంత దారుణం ఏమిటంటే, జిల్లా పోలీసు అధికారుల పేర్లను కూడా వాడుకుంటూ నమ్మకంగా చూపుతున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మోసం చేయడానికి యత్నించారు. *📢 ప్రజలకు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు విజ్ఞప్తి:* ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా సైబ...
Comments
Post a Comment