పింగళి వెంకయ్య వర్ధంతి.. సీఎం నివాళులు
AP: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. 'దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త, గొప్ప దేశభక్తుడు, రచయిత పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆయన నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందాం' అని CM ట్వీట్ చేశారు. 'పింగళి వెంకయ్య తెలుగువారవ్వడం మనకు గర్వకారణం. భారత జాతికి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

Comments
Post a Comment