సోనియా, రాహుల్ విచారణ అనుమతికి ఈడీ పిటిషన్
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. యంగ్ ఇండియా కంపెనీ పేరిట రూ.2వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందని, ఆ డబ్బు కాజేసేందుకు సోనియా, రాహుల్ ప్రయత్నించారని అభియోగాలు మోపింది. దీంతో సోనియా, రాహుల్ విచారణకు కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

Comments
Post a Comment