Skip to main content

బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయం

 బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలి



బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసుసురేష్ 


ఖమ్మం: మా సోదరులు ఎస్సీ, ఎస్టీ . మైనారిటీలను కలుపుకొని గ్రామమే రాజకీయ యూనిట్ చేసి బీసీ రాజ్యాధికార సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో దాసు సురేష్ పాల్గొని మాట్లాడుతూ... గత 78 సంవత్సరాలుగా బీసీలకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 18 శాతానికి కుదించి బీసీలకు వ్యతిరేకంగా పయనించడం వల్లనే గద్దెదించడం జరిగిందన్నారు బీసీలు కాంగ్రెస్తో ప్రయాణించడం వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నా.. ఆ సామాజిక న్యాయం తెలంగాణాలో లేకపోవడం బాధాకరమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానంచేసి నామినేటెడ్ పదవుల్లో మాత్రం సీఎం సామాజిక వర్గానికి వర్తింపజేయటం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు వస్తాయనుకుంటే దానిని తాత్సారం చేస్తున్నారన్నారు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల మీద స్పష్టత ఇవ్వలేక పోయిందన్నారు. అసెంబ్లీలో పాసైన అయిన 42 శాతం బిసి రిజర్వేషన్ ఆమోద బిల్లును గవర్నర్ కు పంపారు కానీ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాలని ప్రశ్నించారు. 1992లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తో సంప్రదించి 92వ రాజ్యాంగ సవరణ చేసి 69శాతం రిజర్వేషన్లను పెంచి అమలు చేయించుకున్నారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు మాని బీసీ రేజర్వేషన్ల పెంపుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ నందు 4 నియోజకవర్గాలకు గాను కనీసం ఒక స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను కనీసం ఒక్క స్థానము కూడా బీసీలకు దక్కక పోవడం బీసీలపై కొనసాగుతున్న తీవ్ర వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. గ్రామస్థాయిలో బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం నల్లేరుపై నడకే నని సురేష్ తెలిపారు జిల్లా బీసీ ముఖ్య నాయకుల సమక్షంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తద్వారా ప్రతి గ్రామాన్ని ఒక రాజకీయ యూనిట్ గా ఏర్పాటు చేసుకొని పూర్తిస్థాయి కమిటీలను మండల, నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా బీసీ ఐక్య వేదికలు ఏర్పాటుచేసి రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు పెళ్లూరి విజయ్ కుమార్ ఉరుకొండ సైదులు, పీట్ల స్వర్ణ కుమార్. నక్క అజయ్ , అయితగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

  *⚠️ సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలపై జిల్లా పోలీసుల హెచ్చరిక* ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన మోసానికి పాల్పడతున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్ల వైద్య పరీక్షల పేరిట డయాగ్నొస్టిక్ సెంటర్లను టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఈ మోసపు తంతు ప్రకారం, Mahabubnagar జిల్లాలో BSF జవాన్ల క్యాంప్ ఉందని నమ్మకంగా చెప్పుతూ, మా వద్ద 27 మంది జవాన్లు మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉందని, ఒక్కొక్కరికీ ₹3500 చొప్పున మొత్తం ఖర్చు అయ్యే వ్యయానికి మా ఆఫీస్ నుండి మీకు చెల్లిస్తామని, అందుకు గాను మీరు మాకు 50% నగదు అంటే ₹47,250 తక్షణం చెల్లిస్తే, రేపు టెస్టులు అయ్యాక మేము మీకు 50%+100% బిల్లు మొత్తం 1,41,750/- నగదును చెల్లిస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో అత్యంత దారుణం ఏమిటంటే, జిల్లా పోలీసు అధికారుల పేర్లను కూడా వాడుకుంటూ నమ్మకంగా చూపుతున్నారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని ఒక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మోసం చేయడానికి యత్నించారు. *📢 ప్రజలకు, డయాగ్నొస్టిక్ సెంటర్లకు విజ్ఞప్తి:* ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా సైబ...
 ⚪ *హైదరాబాద్*  ◽ *ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులును ప్రకటించిన  పార్ట్  అద్యక్షుడు డా .ఈడా శేషగిరిరావు గౌడ్ గారు*   1.*పెద్దపల్లి - గంగుల రాజేంద్ర ప్రసాద్*  (మున్నూరు కాపు) 2.*కొమరం భీమ్ ఆసిఫాబాద్ - పాలే గణపతి*  (అరె - బీసీ)
  భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ,తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి  ఘన నివాళులు తెలిపిన ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు "కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు" మరియు ఖమ్మం జిల్లా ఆధార్ పార్టీ నాయకులు "నక్క  అజయ్ కుమార్ గారు 'తదితర నాయకులు నివాళులు తెలిపారు. ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు  కుక్కల నాగేశ్వరరావు గౌడ్ గారు ఆధార్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు  నక్క అజయ్ కుమార్ గారు