శ్రీశైలం జలాశయంలో 875అడుగులకు చేరిన నీరు
శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 66,746 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 875.60 అడుగులు(పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు) కాగా, నీటి నిల్వ 166.3148 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 63,150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

Comments
Post a Comment