ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
TGలో ఈనెల 14న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో రేషన్ కార్డులివ్వడం ఇదే తొలిసారన్నారు. తుంగతుర్తిలో జరిగే సభలో సీఎం రేవంత్, Dy. CM భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఈ నెల 13 వరకు వెరిఫికేషన్ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 2.89 కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

Comments
Post a Comment